అక్షరటుడే, ఆర్మూర్: జిల్లాలోని పీహెచ్‌సీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఆలూర్‌ మండలం దేగాం పీహెచ్‌సీని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీ ఆవరణలో పిచ్చిమొక్కలు ఉండడాన్ని పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగా యంత్రాలను వినియోగిస్తుండాన్ని ప్రశంసించారు. అదేవిధంగా జిల్లాలోని అని పీహెచ్‌సీల్లో జరగాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజశ్రీని ఆదేశించారు.