అక్షరటుడే, ఇందూరు: గణితంపై భయాన్ని వీడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విద్యార్థులకు సూచించారు. మంగళవారం సిరికొండ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి 10 జీపీఏ సాధించాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని సబ్జెక్టుల కంటే గణితమే సులభమని చెప్పారు. డిజిటల్ విధానంలో విద్యావ్యవస్థ ఎంతో సులభమైందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించి, తక్షణమే ఎంబీ రికార్డు చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయా గౌడ్, మండల ప్రత్యేకాధికారి నాగురావ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం, పంచాయతీరాజ్ అధికారి శంకర్ నాయక్, ఎంపీడీవో లక్ష్మీప్రసాద్, తహశీల్దార్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.