అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ముప్కాల్ మండలం పోచంపాడ్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన వసతులపై పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో సౌకర్యాలపై ప్రిన్సిపల్ సురేందర్‌ను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే నిద్రించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ ఉన్నారు.