అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్‌ సంబరాల పోస్టర్‌ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం ఆవిష్కరించారు. నవంబర్‌ 7న పాఠశాల, మండల స్థాయిలో 21న, జిల్లా స్థాయిలో 28న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పులి జైపాల్‌, గౌరవ అధ్యక్షులు బాస రాజేశ్వర్‌, ఉపాధ్యక్షులు శ్రీహరి ఆచార్య, తుక్కడి నారాయణ, కోశాధికారి పండరి, న్యాయవాదులు శంకర్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.