అక్షరటుడే, వెబ్ డెస్క్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో గోడౌన్ తెరిచారు. నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ యూనిట్లు, సామగ్రి భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కమిషనర్ మకరంద్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, అంబదాస్ రాజేశ్వర్, రాజాగౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, ఫైర్ అధికారి నర్సింగ్ రావు, తదితరులున్నారు.