అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన తీరును పరిశీలించారు. ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.