అక్షరటుడే, బోధన్​ : గ్రామసభల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల వివరాలను వెంటవెంటనే ఆన్​లైన్​లో నమోదు చేయాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు ఆదేశించారు. బోధన్ మండలం బండార్​పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. పథకాల కోసం గ్రామసభలో కొత్తగా వచ్చిన దరఖాస్తుల గురించి ఆరా తీశారు. ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చొరవ చూపాలని సూచించారు. అనంతరం బోధన్ శివారులో గల బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. స్టోర్ రూమ్​లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. నాసిరకమైన బియ్యం, సరుకులు సరఫరా చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, స్థానిక అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Sand Mining | నిబంధనలు పాటించని ఇసుక క్వారీ నిర్వాహకులు