అక్షరటుడే, బోధన్‌: ప్రతి ఇంటికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ పక్కాగా జరగాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం బోధన్‌ లోని రాకాసిపేట, లంగ్డాపూర్‌లో ఇళ్ల జాబితా రూపకల్పన ప్రక్రియను పరిశీలించారు. మూడు రోజుల్లో హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటనారాయణ, తహసీల్దార్‌ విఠల్‌ తదితరులు ఉన్నారు.