అక్షరటుడే, ఇందూరు: పంచాయతీ ఎన్నికల విధులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో సొంత నిర్ణయాలు అమలు చేయొద్దని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి స్పష్టమైన అవగాహనతో ఉంటే పొరపాట్లకు ఆస్కారం ఉండదన్నారు. శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా.. అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి సంబంధిత వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, డీఎల్​పీవో శివకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | నగరంలో బాలుడి అనుమానాస్పద మృతి