అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : మహోన్నతమైన రామాయణాన్ని రచించిన వాల్మీకిని ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ నీతూకిరణ్‌, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి రమేశ్, నర్సయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజశ్రీ, వాల్మీకి సంఘం అధ్యక్షుడు నరేశ్‌, బీసీ సంఘాల నాయకులు బుస్సా ఆంజనేయులు, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bhu Bharathi Nizamabad | భూ వివాదాల పరిష్కారానికే 'భూభారతి'