అక్షరటుడే, ఇందూరు: ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానసికోల్లాసానికి క్రీడలు అవసరమన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆఫీసర్స్ క్లబ్లో స్విమ్మింగ్‌పూల్ మంజూరుకు ప్రతిపాదించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటరమణ, గంగాకిషన్, భక్తవత్సలం, రాంకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.