అక్షరటుడే, ఇందూరు: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థానాలను అధిరోహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. వర్ని మండలం కోటయ్య క్యాంప్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్‌ డైట్‌ప్లాన్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం 40శాతం డైట్‌ఛార్జీలు, 200 శాతం కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు కలెక్టర్‌ కోటగల్లీలోని బీసీ, ఎస్సీ, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. ఆయన వెంట నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, జిల్లా బీసీ సంక్షేమ సహాయ అధికారి నర్సయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి భూమయ్య, అధికారులు సహదేవ్‌, రాధారాణి, కల్పన తదితరులున్నారు.