అక్షరటుడే, బోధన్​: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో మన ఊరు – మన బడి కింద ఇటీవల నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలకు కొత్త బియ్యం పంపడంతో అన్నం మెత్తగా అవుతోందని ప్రిన్సిపాల్ అర్షియా నజమ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన ఆయన సివిల్ సప్లయ్స్ డీఎంకు ఫోన్ చేసి పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పాత బియ్యం నిల్వలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహశీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  farmers | సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించాలి