అక్షరటుడే, బాన్సువాడ: విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. బుధవారం వర్ని మండలం పాత వర్ని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. వంట సామగ్రి నిల్వ చేసే గదులను, భోజనం వండే విధానాన్ని పరిశీలించారు. తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలను ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సాయిలు, ఎంపీడీవో వెంకటేష్, ఎంఈవో సాయిలు పాల్గొన్నారు.
భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
Advertisement
Advertisement