అక్షర టుడే, వెబ్ డెస్క్: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం దివ్యాంగ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మీదుగా క్యాలెండర్ తో పాటు దివ్యాంగుల హక్కుల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షుడు శంకర్ రాజు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షుడు రాజన్న, దివ్యాంగ నాయకులు కృష్ణరెడ్డి, బస్వయ్య, సాయి ప్రసన్న, మల్లుగొండ, గంగాధర్, పండరి, దత్తు, విద్యసాగర్, వెంకటేశ్, ప్రమోద్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement