అక్షరటుడే, నిజామాబాద్‌: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.