అక్షరటుడే, వెబ్‌డెస్క్ : వివిధ దేశాలకు సరఫరా చేస్తున్న 1400 మెట్రిక్ టన్నుల మాదక ద్రవ్యాలను కొలంబియా నేతృత్వంలో అంతర్జాతీయ భద్రతా బృందాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఈ సందర్బంగా డ్రగ్స్ సరఫరాకు వాడుతున్న ఆరు జలాంతర్గాములను (నార్కో సబ్స్)ను కూడా సీజ్ చేశారు. ఈఆపరేషన్‌లో 62 దేశాలు పాల్గన్నాయి. ఈదాడుల్లో పట్టుబడిన వాటిలో మొత్తం 225 టన్నుల కొకైన్ కూడా ఉన్నట్లు కొలంబియా నేవీకి చెందిన ఆపరేషన్స్ చీఫ్ వెల్లడించారు.