అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తంగా సోమవారం 51 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.