అక్షరటుడే, ఆర్మూర్ : సమగ్ర కుటుంబ సర్వే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గురువారం వరకు 96శాతం పూర్తయిందని కమిషనర్ రాజు తెలిపారు. మిగిలిన సర్వేను రేపటి లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా సర్వే పూర్తయిన కుటుంబాలకు సంబంధించిన డాటా ఎంట్రీ సైతం ప్రారంభించామన్నారు. మున్సిపల్ ఆఫీసు, నరేంద్ర కాలేజీలో డాటా ఎంట్రీ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సర్వే పూర్తయిన ఎన్యుమరేటర్లు డాటా ఎంట్రీ ఆపరేటర్ల సహాయంతో సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేస్తామని చెప్పారు.