Advertisement
అక్షరటుడే ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ రాజు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 11 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
రెండు రోజుల్లో ముగియనున్న పదవీకాలం
ఈనెల 26తో మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగియనుంది. శనివారం జరిగే మున్సిపల్ సమావేశం చివరిది కానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 34 ఎజెండా అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Advertisement