అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | జీతం డబ్బుల కోసం లంచం డిమాండ్ చేసిన ఓ అధికారిని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్(Karimnagar) జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన వీవోఏ(VOA) తన జీతం డబ్బులు రూ.60 వేలు చెల్లించాలని ఐకేపీ(IKP) కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ పసరకొండ సురేశ్‌ను కోరింది.
Advertisement
ఇందుకోసం ఆయన రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మంగళవారం బాధితురాలు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సురేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Advertisement