అక్షరటుడే, ఆర్మూర్‌ : జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ గిరిబాబు సూచించారు. ఆర్మూర్‌ మండలం ఫతేపూర్‌ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement