Collector | నాసిర‌కం వ‌స్తువులు వ‌స్తే ఫిర్యాదు చేయండి
Collector | నాసిర‌కం వ‌స్తువులు వ‌స్తే ఫిర్యాదు చేయండి
Advertisement

అక్ష‌ర‌టుడే, ఇందూరు: Collector | పాఠ‌శాల‌కు నాసిర‌కం బియ్యం, ఇత‌ర స‌రుకులు పంపిణీ చేస్తే స్థానిక మండ‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు పేర్కొన్నారు. గురువారం డిచ్‌ప‌ల్లి మండ‌ల ధ‌ర్మారం సాంఘిక సంక్షేమ బాలిక‌ల రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌, క‌ళాశాల‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. వంట‌శాల‌, త‌ర‌గ‌తి గ‌దులు, స్టోర్‌ రూంను త‌నిఖీ చేశారు. బియ్యం నిల్వ‌లు, కూర‌గాయ‌ల నాణ్య‌త‌ను, స‌రుకుల స్టాక్ లిస్ట్‌ను ప‌రిశీలించారు. త్వర‌లో ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  AISF | పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతి

Collector : ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ..

రెసిడెన్షియల్ స్కూల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని రాజీవ్‌గాంధీ హ‌నుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాలకు అనుమతించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లత, అధికారులు ఉన్నారు.

Advertisement