అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | సమస్యల పరిష్కార నిమిత్తం పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు గౌరవంగా వ్యవహరించాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర(Kamareddy SP Rajesh Chandra) పేర్కొన్నారు. శనివారం ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పీఎస్‌లలో రికార్డులన్నీ సక్రమంగా నిర్వహించాలని.. స్టేషన్ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రూట్‌మ్యాప్(Route map)ను పరిశీలించారు. తనిఖీల్లో స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.