ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షౌకత్ అలీపై చర్యలు తీసుకోవాలని లింగంపేట గ్రామ యువకులు కోరారు. మంగళవారం ఎస్సై చైతన్య కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి మాతకు పూజలు చేయవద్దని పాఠశాల సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వారు ఆరోపించా రు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహ రించిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యా శాఖాధికారికి ఫిర్యాదు అందజేశారు.