అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SC ST Commission : గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం గ్రామానికి చెందిన నరసింహ మూర్తి నందిపేట మండల కేంద్రానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ కస్పా శ్యామ్ చేతిలో మోసపోయాడు.
అనంతరం గ్రామంలోనే ఆయనపై శ్యామ్‌తో పాటు మధు, సాయిరెడ్డి, గుడ్ల ప్రకాష్ అనే వ్యక్తులు దాడి చేశారు. దీంతో నరసింహమూర్తి నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అట్రాసిటీ కేసు నమోదైనా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతి పత్రం అందించాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ వెంకటయ్య బాధితుడికి హామీ ఇచ్చారు.