అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ipl Betting | మహారాష్ట్రలోని Maharashtra ధర్మాబాద్ కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ దందా అంతాఇంతా కాదు. ప్రతి ఐపీఎల్ సీజన్(Ipl season)లో కోట్లాది రూపాయలు ఈ దందా వెనుక చేతులు మారుతున్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బెట్టింగ్ యాప్‌ల(Betting apps) ద్వారా యువతను ఇందుకు బానిసలుగా చేసి రూ. లక్షల్లో నగదు పెట్టిస్తున్నారు. తీరా.. బెట్టింగ్ కోసం చేసిన అప్పులను తీర్చలేక పలువురు యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా.. బెట్టింగ్ దందా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు మహారాష్ట్ర సర్కారు(Maharashtra government)కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.
ధర్మాబాద్ కేంద్రంగా శంకర్ బొలంవార్, అంకుశ్ నిరావార్, ప్రవీన్ బర్లేవార్, మనోజ్ మందాని సహా పలువురు పెద్ద ఎత్తున బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఔరా 24, సాయి తదితర యాప్‌ల ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించి అక్రమంగా బెట్టింగ్ illegally betting నిర్వహిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ కమిషనరేట్(Nizamabad commissionerate) పోలీసులు పలువురు యువతను పట్టుకోవడంతో ధర్మాబాద్ Dharmabad కేంద్రంగా నడుస్తున్న బాగోతం బయటపడింది. సచిన్ ఉత్తర్వార్ బుకీగా ఉండి యువతతో బెట్టింగ్ పెట్టిస్తున్నట్లు గుర్తించారు. కాగా.. సచిన్ ఉత్తర్వార్ లాంటి ఎందరో బుకీలను శంకర్ బొలంవార్, అంకుశ్ నిరావార్, ప్రవీన్ బర్లేవార్, మనోజ్ మందాని పెంచిపోషిస్తున్నారు.
బెట్టింగ్ దందా కారణంగా రూ.లక్షల్లో అప్పులు చేసిన యువత వాటిని తిరిగి చెల్లించలేక సూసైడ్‌కు పాల్పడుతున్నారు. గత సీజన్లోనే last ipl season దాదాపు పాతిక మంది వరకు ధర్మాబాద్ darmabad చుట్టు పక్కల ప్రాంతాల్లో యువత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తదనంతరం అక్కడ పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ బెట్టింగ్ దందాను తెలంగాణకు విస్తరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పలువురు యువత వీరి వద్ద బెట్టింగ్ పెట్టి తీరా అప్పల పాలై కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో దందాకు పాల్పడుతున్న ముఠాల పట్ల పోలీసులు police of Telangana ప్రాంతాలను పక్కనబెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.