అక్షరటుడే, కామారెడ్డి: KAMAREDDY SP | పోలీస్స్టేషన్లలో నమోదయ్యే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి పనితీరును తెలుసుకున్నారు. నేరాలు జరుగుతున్న తీరు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే విధానాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను, కమాండ్ కంట్రోల్ రూం, సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
KAMAREDDY SP | ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
Advertisement
Advertisement