అక్షరటుడే, ఆర్మూర్ : ప్రజలకు సమన్యాయం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం జరిగిన సర్వేలో ఆయన పాల్గొన్నారు. సర్వే గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మాజీ వైస్ ఛైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కౌన్సిలర్లు మంజుల మురళి, వనం శేఖర్, భాగ్యలక్ష్మి శివ, నాయకులు ఎస్ కే బబ్లు పాల్గొన్నారు.