అక్షరటుడే, ఆర్మూర్‌: ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేశ్‌ బిధూరిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సూరకంటి చిన్నారెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం పట్టణంలో రమేశ్‌ బిధూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు దాసరి శ్రీకాంత్‌, కటిక శ్రీనివాస్‌, ఇందూరు సాయన్న, జన్నెపల్లి గంగాధర్‌, చిట్యాల పోశెట్టి, ఎన్‌ఎస్‌ రెడ్డి, సొక్కం సంజీవ్‌, దుబ్బాక సాయన్న, సుభాష్‌, నూత్పల్లి అశోక్‌, నాగరాజ్‌ పాల్గొన్నారు.