అక్షరటుడే, నెట్వర్క్: CONGRESS PARTY | ఉమ్మడిజిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేటీఆర్ అసెంబ్లీలో స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారిరువురి దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారిద్దరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
CONGRESS PARTY | నోరు అదుపులో పెట్టుకోవాలి..
ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వాఖ్యలు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నరాల రత్నాకర్, వేణు రాజ్, రాజ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
CONGRESS PARTY | అనుచిత వ్యాఖ్యలు చేశారు..

నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, బలరాం, అనీష్, వెంకటరామిరెడ్డి, రమేష్, గౌస్ పటేల్, రాజారాం, జగన్, రాము రాథోడ్, ప్రవీణ్, బ్రహ్మం, చాంద్ పాషా, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
CONGRESS PARTY | స్పీకర్‌ను అగౌరవపర్చారు..

దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, అనంతరెడ్డి, షమీ, శ్రీనివాస్ తదితరులున్నారు. బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
CONGRESS PARTY | వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల మారుతి, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు రవి, మహిళా అధ్యక్షురాలు ఇందిరా, నాయకులు మోహన్, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CONGRESS PARTY | సభ్యత్వాలు రద్దు చేయాలి

అసెంబ్లీలో జగదీష్‌రెడ్డి, కేటీఆర్‌ల సభ్యత్వాలను రద్దు చేయాలని కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి పట్టణంలో ఆదివారం కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు, కామారెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
CONGRESS PARTY | అమర్యాదగా ప్రవర్తించారు..

ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జగదీష్‌రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, మైనార్టీ సెల్ ప్రతినిధి రఫీయొద్దీన్, లింగంపేట్ టౌన్ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జొన్నల రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, మాజీ మండల అధ్యక్షుడు ఎల్లమయ్య తదితరులు పాల్గొన్నారు.
CONGRESS PARTY | వ్యాఖ్యలు సరికావు..

బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, జిల్లా యువజన అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు కాలేక్, కృష్ణారెడ్డి, నార్ల సురేశ్ గుప్తా, ఎజాస్, వెంకన్న నందు, నార్ల రవీందర్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CONGRESS PARTY | బర్తరఫ్ చేయాలి..

ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో ఏఏంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ లావణ్య, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ లింగాగౌడ్, కాంగ్రెస్ నేతలు కొంతం మురళి, దాసరి శ్రీకాంత్, లింబాద్రి, రమణ, రవి, కొక్కెర భూమన్న పాల్గొన్నారు.
CONGRESS PARTY | నల్లబ్యాడ్జీలతో నిరసన..

ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
CONGRESS PARTY | అమర్యాదగా ప్రవర్తించడం సరికాదు..

దళిత స్పీకర్‌పై వ్యాఖ్యలు సరికాదని బిచ్కుంద కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కేటీఆర్, జగదీష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గంగాధర్, పట్టణ అధ్యక్షుడు సాహిల్ షెట్కార్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ తదితరులున్నారు.
CONGRESS PARTY | బీఆర్ఎస్ నాయకులు దళిత వ్యతిరేకులు..

బీఆర్ఎస్ నాయకులు దళిత వ్యతిరేకులని బీబీపేట కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కేటీఆర్, జగదీష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.