అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి అభివృద్ధికి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆరోపించారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్ పేరిట జిల్లా అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో అధికారులు సెలవుల్లో వెళ్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టోలో ఇచ్చిన రూ.150 కోట్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, శ్రీనివాస్, భీంరెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement