అక్షరటుడే, వెబ్ డెస్క్ : పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆదివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ బిడ్డకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement