అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో స్పీకర్ ప్రమాణం చేయించారు. తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె పార్లమెంట్‌కు చేరుకున్నారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఆమె ప్రమాణం చేశారు. కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి ప్రియాంక సభకు హాజరయ్యారు. కాగా కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.