అక్షరటుడే, జుక్కల్‌: మహమ్మద్‌నగర్‌ మండలాభివృద్ధికి కృషి చేయాలని బాన్సువాడ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్‌ మండల నాయకులు కోరారు. బుధవారం ఆయనను కలిసి సన్మానం చేశారు. అనంతరం ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్‌ కాసు బాలరాజ్‌ను సైతం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పార్టీ ఎస్టీ సెల్‌ జిలా ఉపాధ్యక్షుడు లోక్యానాయక్‌, నాయకులు భాస్కర్‌రెడ్డి, హరిబాబు, భూమా గౌడ్‌, గుల కిష్టయ్య, గంజి హన్మాండ్లు, జక్మాల్‌ బలరాం, షేక్‌ మొయిన్‌, సిద్దు రెడ్డి, ఇస్మాయిల్‌, సాయాగౌడ్‌, నర్సింలు పాల్గొన్నారు.