అక్షరటుడే, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం నిర్వహించనున్న రాహుల్ గాంధీ సభాస్థలిని ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, నుడా ఛైర్మన్ కేశ వేణు తదితరులు సభ ఏర్పాట్లపై ఆరా తీశారు. వారు వెంట మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.