అక్షరటుడే, హైదరాబాద్: ED office : హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట 17న కాంగ్రెస్ నాయకుల నిరసన తెలపనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లపై ఈడీ ఛార్జిషీట్‌కి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC president Mahesh Kumar Goud) ప్రకటించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా రెండ్రోజుల కిందటి నుంచి దర్యాప్తు సంస్థ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. అలాగే చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.