అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభకు ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సభలో ఆయన పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అవిశ్వాస తీర్మానానికి తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌తో సహా ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి.