CM Revanth | కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి విరాళం ఇవ్వాల్సిందే : సీఎం

CM Revanth | కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి విరాళం ఇవ్వాల్సిందే : సీఎం
CM Revanth | కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి విరాళం ఇవ్వాల్సిందే : సీఎం

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy అధ్యక్షతన మంగళవారం సీఎల్పీ CLP సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని ఆయన సూచించారు. అంతేగాకుండా ఎమ్మెల్యేలు ఇక ప్రతి నెలా తమ జీతం నుంచి రూ.25 వేలు పార్టీకి విరాళం donation ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

Advertisement
Advertisement

CM Revanth | ఓపికతో ఉండాలి..

పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల మంత్రి పదవులు Minister Posts ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని ప్రకటించారు. తమకు మంత్రి పదవి కావాలని పలువురు డిమండ్​ చేస్తూ మీడియా ఎదుట మాట్లాడారు. దీనిపై సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌మెయిల్ చేస్తే భయపడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  SC classification | తెలంగాణలో నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

ఓపికతో ఉన్న వారికే పదవులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అద్దంకి దయాకర్ addanki dayakar ఓపికతో ఉండటంతో ఎమ్మెల్సీ MLC పదవి వచ్చిందని చెప్పారు. కాగా.. అద్దంకి దయాకర్ గతంలో ఎమ్మెల్యే టికెట్​ ఆశించారు. అయితే అప్పుడు ఆయనకు టికెట్​ దక్కలేదు. అయినా కూడా పార్టీ కోసం పనిచేశారు. దీంతో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కాంగ్రెస్​ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement