అక్షరటుడే, బోధన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో ట్రస్మా సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు రావాల్సిన బకాయిల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజిరెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
నన్ను గెలిపిస్తే ప్రైవేటు టీచర్లకు ఉద్యోగ భద్రత
Advertisement
Advertisement