అక్షరటుడే, జుక్కల్: రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ మహమ్మద్‌నగర్ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి మాటతప్పిందని.. కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ అయ్యాయని పేర్కొన్నారు. చిన్నచిన్న తప్పిదాల వల్ల మాఫీకాని వారికి త్వరలో మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లయ్యగారి ఆకాశ్, నాయకులు నాగభూషణం గౌడ్, ఖాలిక్, సవాయి సింగ్, హరిన్, శ్రీనివాస్ రెడ్డి, తోటరాజు సాయా గౌడ్ పాల్గొన్నారు.