అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశ వేణు అన్నారు. గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నగరాభివృద్ధి కోసం షబ్బీర్‌అలీ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కాలేజీగా తీర్చిదిద్దుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో పాత కలెక్టరేట్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర పన్నారని.. కానీ తమ ప్రభుత్వం ఆ స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇండోర్ స్టేడియం కోసం షబ్బీర్ అలీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇవ్వన్నీ తెలియని బీజేపీ ఎమ్మెల్యే.. షబ్బీర్ అలీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అనవసర విమర్శలు మానుకోవాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.