అక్షరటుడే, ఆర్మూర్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి వినయ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సోషల్‌ వెల్ఫేర్‌ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన డైట్‌ మెనూ లాంచింగ్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాశాలకు చెందిన విద్యార్థినులను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, రేగుల సత్యనారాయణ ,డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ వాసు, మాజీ వైస్‌ ఛైర్మన్ లింగాగౌడ్, భూపేందర్, చిట్టి రెడ్డి, సుమన్, నటరాజు, తదితరులు పాల్గొన్నారు.