Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్ : ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరావు పటేల్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రే ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని ఏరియాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కమల జిన్నింగ్ ఫ్యాక్టరీలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అలాగే ఆయా మండల కేంద్రాల్లోనూ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంచందర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు షాహిద్, ముత్యం రెడ్డి, కార్యకర్తలు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement