అక్షరటుడే,ఎల్లారెడ్డి : పట్టణంలోని ఓ అనాథ కుటుంబానికి దుప్పట్లను కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ మండల అధ్యక్షుడు సంతోష్‌ నాయక్‌ ఉన్నారు.