అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కించపరుస్తూ కేటీఆర్‌ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద శుక్రవారం కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే.. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, వేణురాజ్‌, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.