అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఈసీ తన స్వతంత్రతను కోల్పోతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం మార్పులు చేయడాన్ని తప్పుబట్టారు. ఈసీ సమగ్రతను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆరోపించారు. ఓటర్ల పేర్లు తొలగింపు, ఈవీఎంలలో పారదర్శకత లేకపోవడం వంటి అక్రమాల గురించి మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు బయట పడకుండా ఉండేందుకు పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించిందన్నారు. ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.
Advertisement
Advertisement