అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Election | హైదరాబాద్(Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(MLC) ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ ఎంఐఎంకు MIM మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
MLC Election | ఏ పార్టీ బలం ఎంత
గ్రేటర్ హైదరాబాద్ మున్నిపల్ ఎన్నికలు Hyderabad Municipal Elections 2020లో జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం MIM 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి GHMC Mayor Vijayalakshmi, పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. అయినా లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునేంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండి ఎంఐఎంకు మద్దతు తెలపనుంది.
MLC Election | ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల local bodies MLC election నోటిఫికేషన్ మార్చి 28న వెలువడింది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 23న పోలింగ్(Polling) నిర్వహించి, 25 కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్(Prabhakar) పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే తమ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. హస్తం మద్దతుతో ఎమ్మెల్సీ గెలుచుకోవాలని ఎంఐఎం యోచిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం ఈ సీటు ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది.