అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తనపై ట్రోలింగ్‌ చేస్తున్నవాళ్లను దొరికినప్పుడు బట్టలూడదీసి కొడ్తానని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హెచ్చరించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు మాట్లాడిన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ముసుగులో కాంగ్రెస్‌ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు అధికారం దూరం కావడంతో మతిభ్రమించదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని ఏదో ఒక విషయంలో బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.