అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Conocarpus trees | సాధారణంగా చెట్లంటే(Trees) నీడను, చల్లని గాలినిస్తాయి. పచ్చని చెట్ల కింద కూర్చుంటే ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం లభిస్తుంది. కానీ ఈ చెట్ల కింద కూర్చొంటే ఉన్న రోగాల బారిన పడతాం. పర్యావరణానికి ఎలాంటి మేలు చేయకపోగా మనుషులు, జంతువుల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కోనోకార్పస్ మొక్కలు. ఈ మొక్కలపై మంగళవారం అసెంబ్లీ(Assembly)లో ఆసక్తికర చర్చ జరిగింది.
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి(Vemula Prashanth Reddy) మాట్లాడుతూ బీఆర్ఎస్(BRS) హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామన్నారు. దీనిపై స్పీకర్(Speaker) ప్రసాద్‌కుమార్(Prasad Kumar) స్పందిస్తూ అందులో కోనోకార్పస్ మొక్కలే అధికంగా ఉన్నాయని చెప్పారు. ఇతర చెట్లు అన్ని కార్బన్ డై ఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయని, ఇవి మాత్రం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయని స్పీకర్ తెలిపారు. వీటితో పర్యావరణం దెబ్బతింటుందని.. తొలగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
Conocarpus trees | ఎందుకంత డేంజర్
కోనోకార్పస్ మొక్కలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇవి తక్కువ కాలంలో ఏపుగా పెరుగుతాయి. దీంతో బీఆర్ఎస్ హయాంలో హారితహారం(Haritha Haram)లో భాగంగా చాలా చోట్ల వీటిని నాటారు. అయితే ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరిగితే గడ్డిజాతి, ఇతర కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతుందని, తద్వారా వన్యప్రాణాలకు ఆహారం దొరకదని పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలాదేశాలతో పాటు తెలంగాణ(Telangana) ప్రభుత్వం కూడా ఈ మొక్కలు నాటడాన్ని నిషేధించింది.
Conocarpus trees | శ్వాసకోశ వ్యాధులు
కోనోకార్పస్ మొక్కలతో మనుషుల చర్మం, శ్వాసకోశ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుంది. వీటి పుప్పొడి చాలా ప్రమాదకరం. ఈ చెట్లతో చర్మ, శ్వాసకోశ వ్యాధులు, రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. వీటితో కలిగే నష్టాలను గుర్తించిన ప్రభుత్వం కొత్తగా నాటొద్దని ఆదేశించింది. అయితే గతంలో నాటిన కోనోకార్పస్ మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. వాటి తొలగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ వాటిని తొలగించాలని చెప్పడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.